Corona Free Village : దమ్మయ్య పేట దమ్ము..ఊరి పొలిమేర తొక్కడానికి భయపడ్డ కరోనా

ఆ గ్రామం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత సంవత్సరం నుంచి గ్రామంలో పాటిస్తున్న కరోనా నిబంధనలతో మహమ్మరి ఆ గ్రామ పొలిమేరల్లో కూడా అడుగు పెట్టలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామం కరోనా ఫ్రీగా పేరు తెచ్చుకుంది. ఆదర్శంగా నిలుస్తోంది.

Corona Free Village : దమ్మయ్య పేట దమ్ము..ఊరి పొలిమేర తొక్కడానికి భయపడ్డ కరోనా

Corona Free Village

Corona Free Village In Telangana : కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి యుద్ధం చేస్తే విజయం నీ ముంగిటే అనేవి పెద్దలు అనుభవంతో చెప్పిన మాటలు. కోవిడ్ తో మొత్తం ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో పట్టణాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యేవి. కానీ ఈ సెకండ్ వేవ్ లో పట్టణాలతో పాటు పల్లెలకు కూడా పాకిందీ మహమ్మారి. కానీ కరోనా ఛాయలు కూడా లేని గ్రామాలు కూడా ఉన్నాయి మనదేశంలో. అటువంటి గ్రామాలు మొత్తం మన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అటువంటి ఓ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని దమ్మయ్య పేట గ్రామం. తెలంగాణను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దమ్మయ్యపేట పొలిమేరల్లోకి కూడా వెళ్లలేకపోయింది. కానీ ఈ గ్రామస్తుల కట్టడి. కలిసి కట్టుగా అమలు చేస్తున్న చర్యలు.అందుకే కరోనాను కట్టడి చేయటమే కాదు అసలు ఊరి సరిహద్దుల్లోకి కూడా కరోనాను రానివ్వలేదు దమ్మయ్యపేట గ్రామస్తులు. అందుకే కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచింది దమ్మయ్యపేట గ్రామం. కోవిడ్ ఫ్రీ విలేజ్ గా పేరు తెచ్చుకుంది.

ఇప్పటి వరకూ దమ్మయ్యపేట గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదంటే వారి కట్టుబాట్లు, నిబద్ధత ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం, ఉపాధి పనులకు తప్ప మరి దేనికి గ్రామం బైటకు రావట్లేదు ఆ గ్రామ వాసులు.అలాగే బైట గ్రామాలవారిని ఆ గ్రామంలో అడుగు పెట్టనివ్వటందే. ప్రతీరోజు కరోనా గురించి అవగాహన కల్పించటం. మాస్కులు ధరించటం..ప్రతీ రెండు రోజులకు ఒకసారి గ్రామంలోనీ ప్రతీ వీధి శానిటైజ్ చేయటం..ఎవరికన్నా జ్వరం ఉందని తెలిస్తే వెంటనే వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపించటం గ్రామ పెద్దలు, అధికారులు చేస్తుంటారు. అలా కరోనా మహమ్మారి ఊరి పొలిమేరల్లోకి కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకన్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకూ అవే పాటిస్తున్నారు. నిబంధనలు పాటించటంలో గ్రామస్తులంతా పర్ఫెక్ట్ గా పాటిస్తుంటారు. పంచాయితీ నిధులు నుంచి డబ్బులతో మాస్కులు కొని గ్రామం అంతా పంచారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలనే నిబంధన పెట్టుకున్నారు. పెట్టుకున్నట్లే అమలు చేస్తున్నారు కూడా. ప్రతీ ఒక్కరూ శానిటైజర్ వాడాలని గ్రామ సర్పంచ్ అవగాహన కల్పిస్తుంటారు.

నిత్యావసర వస్తులు కొనుక్కోవటానికి ఓ సమయం పెట్టుకున్నారు.హోటల్స్ క్లోజ్ చేయించారు. ప్రతీ వీధిలోను రెండు రోజులకు ఒకసారి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్వచ్ఛంధ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ఒకవేళ అత్యవసరంగా బైటకు ఎవరైనా రావాల్సి వస్తే కచ్చితంగా మాస్కులు ధరించాలి. శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు. గత సంవత్సరం నుంచీ కూడా గ్రామంలో వేడుకలు జరిగిన సమయంలో పరిమిత సంఖ్యలోనే జనాలు హాజరయ్యేలా చూసుకుంటున్నారు. గత మార్చి నెల నుంచి దమ్మయ్యపేట గ్రామస్తులు ఇదే పాటిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందే ఏ ఒక్క అంశాన్ని కూడా అక్కడ జరగనివ్వరు. జనాలు ఒకచోట గుమిగూడటం లాంటివి అస్సలు జరగకుండా చూస్తున్నారు. మాస్కు ధరించటం, శానిటైజ్ చేసుకోవటం వంటి పలు జాగ్రత్తలు గత సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నారు. అందుకే దమ్మయ్య పేట కరోనాను దరిచేరనివ్వకుండా కట్టడి చేయటంలో ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా ఫ్రీ విలేజ్ గా పేరొందింది. దటీజ్ దమ్మున్న దమ్మయ్యపేటగా నిలిచింది.