తెలంగాణలో కరోనా..1269 కేసులు

10TV Telugu News

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి చేరింది.

8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 356కి చేరింది. ప్రస్తుతం 11 వేల 883 మంది చికిత్స పొందుతుండగా…1563 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆదివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ లో 800, రంగారెడ్డి 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, కరీంనగర్ లో 23, నాగర్ కర్నూలు లో 23, మహబూబ్ నగర్ లో 17, నల్గొండలో 15, వనపర్తిలో 15, మెదక్ లో 14. వరంగల్ నగరలో 12, నిజామాబాద్ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.

Read Here>>పాక్ కన్నా చైనాతోనే భారత్ కు భారీ ముప్పు

×