తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 06:27 AM IST
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి.

దీంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటుండడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

1296 పాజిటివ్ కేసులు : – 
2020, జులై 19వ తేదీ ఆదివారం కొత్తగా 1296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 45 వేల 076 కు చేరింది. ఇందులో 12 వేల 224 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం కరోనా కారణంగా 6 మంది చనిపోయారు. ఇప్పటి వరకు నమోదైన మరణాలు 415కి చేరాయి. 1831 మంది డిశ్చార్జ్ కాగా..ఇప్పటి వరకు 32 వేల 438 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఎక్కడెక్కడ ఎన్ని కేసులు : –
జీహెచ్‌ఎంసీ 557. వరంగల్ అర్బన్ 117. రంగారెడ్డి 111. మేడ్చల్ 87. కామారెడ్డి 67. వరంగల్ రూరల్ 41. మెదక్ 29. పెద్దపల్లి 29. సంగారెడ్డి 28. కరీంనగర్ 27. నల్లగొండ 26. నిజామాబాద్ 24. మహబూబాబాద్ 21. రాజన్న సిరిసిల్ల 19. సూర్యాపేట 16.

ఆదిలాబాద్ 15. యాదాద్రి భువనగిరి 15. కర్నూల్ 13. నాగర్ కర్నూలు 13. జగిత్యాల 11. సిద్దిపేట 10. వనపర్తి 7. మహబూబ్ నగర్ 6. ఖమ్మం 5. జనగాం 5. గద్వాల్‌ జిల్లాలో 4. ములుగు 2. ఆసీఫాబాద్ 1. నిర్మల్ 1. మంచిర్యాల 1. వికారాబాద్ 1 కేసులు నమోదు అయ్యాయి.