తెలంగాణలో కరోనా.. ‘లక్ష’ ణంగా కోలుకున్నారు

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 05:49 AM IST
తెలంగాణలో కరోనా.. ‘లక్ష’ ణంగా కోలుకున్నారు

తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా సోకితే..వీరిలో లక్ష మంది కోలుకున్నారు. 32 వేల మంది చికిత్స పొందుతున్నారు. 856 మంది మరణించారు. రాష్టంరంలో మరణాల రేటు 0.64% (దేశ సగటు 1.75%)గా ఉంది.



తొలుత హైదరాబాద్ కు పరిమితమైన కరోనా పరీక్షలు ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు చేరుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం 30 కేంద్రాల్లో RTPCR పరీక్షలు చేస్తున్నారు. కరోనా పరీక్షలతో పాటు ట్రేసింగ్ పక్కాగా నిర్వహిస్తున్నారు. 59 వేల మందికి టెస్టులు చేస్తే..ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు పరీక్షలు 35 వేల వరకు ఉన్నాయి. ఒక్కరోజే 2 వేల 817 మందికి కరోనా సోకిందని తేలింది. జీహెచ్ఎంసీలో 452 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 16 కేసులు వెలుగు చూశాయి.

పాజిటివ్‌ కేసులు (బుధవారం ఒక్క రోజు) 2,817. మొత్తం 1,33,406



డిశ్చార్జి (బుధవారం ఒక్క రోజు) 2,611. మొత్తం 1,00,013

మరణాలు (బుధవారం ఒక్క రోజు) 10. మొత్తం 856



చికిత్స పొందుతున్నవారు –  మొత్తం. 32,537