మే 4 నుంచి షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ ఓపెన్ 

  • Published By: murthy ,Published On : May 1, 2020 / 09:07 AM IST
మే 4 నుంచి షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ ఓపెన్ 

కరోనా లాక్‌డౌన్ గడువు మే3 వ తేదీతో ముగియనుండడంతో కర్ణాటక రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్ధలు , వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం సిధ్దమయ్యింది.   ఇందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం  జారీ చేసింది.  మే 4 నుంచి షాపింగ్‌ మాల్స్, మద్యం దుకాణాలు, ఇత‌ర వ్యాపార‌సంస్థ‌లు ఓపెన్ చేస్తే సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. 
 

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. (మాస్క్‌ ఉంటేనే పెట్రోల్‌.. రేషన్ కూడా!)

అలాగే, మే 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. అయితే లాక్ డౌన్‌ను కొనసాగిస్తారా.. లేదా.. అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన తర్వాతే దీనిపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం ఎడియూరప్ప స్పష్టం చేశారు.