Ask My KTR : కరోనా తగ్గుముఖం పట్టింది, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం

Ask My KTR : కరోనా తగ్గుముఖం పట్టింది, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం

Corona Ktr

Corona Out Break : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా దేశ స‌గ‌టు కంటే తెలంగాణ‌ మెరుగ్గా ఉంద‌నే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కు సొంత వైద్యం వద్దని, మానకంగా ధృడంగా ఉండాలని సూచించారు. కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ చానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలన్నారు. కోవిడ్ నియంత్రణ, సంబంధిత అంశాలపై మంత్రి కేటీఆర్…ట్విట్టర్ వేదికగా..ఆస్క్ కేటీఆర్ పై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్‌డౌన్ వ‌ల్ల కరోనా కొంత తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డిగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదని… తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్, హైప‌ర్‌టెన్ష‌న్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని, అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధిగ‌మించిన‌ట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సమర్థవంతంగా కొనసాగుతుందన్నారు. కొంతమంది సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని అంటున్నా…ప్రజల సౌకర్యార్థం నాలుగు గంటల పాటు వెసులుబాటు ఇస్తున్నామన్నారు.

ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైతం తెలంగాణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉందన్నారు. వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదన్నారు మంత్రి కేటీఆర్.

Read More : Corona Vaccine in India: ఈ ఏడాది చివరికి అందరికీ వ్యాక్సిన్.. రోడ్‌మ్యాప్‌ రెడీ!