Negligence: కూరగాయలు అమ్ముతున్న కరోనా పేషెంట్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో క్రమంగా తగ్గుతుంది. ఇక సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.

Negligence: కూరగాయలు అమ్ముతున్న కరోనా పేషెంట్

Negligence

Negligence: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో క్రమంగా తగ్గుతుంది. ఇది మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇదే సమయంలో థర్డ్ వేవ్ ప్రభావం సెకండ్ వేవ్ కంటే అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు అంచన వేస్తున్నారు. మరో వైపు కరోనా కట్టడికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే క్రమంలో కరోనా సోకిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు పంపి పౌష్ఠిక ఆహారం అందింస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే కొందరు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకినా కూడా బయటకు వస్తున్నారు. మరికొందరైతే తన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ మహిళ కరోనా సోకింది అనే విషయం తెలిసికూడా మార్కెట్లో కూరగాయలు అమ్మింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.

కూరగాయల వ్యాపారం చేసే మహిళకు కొద్దీ రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో అధికారులు ఆమెను ఇంట్లోంచి బయటకు వెళ్లోద్దని తెలిపారు. కానీ మహిళ ఇంట్లో ఉండకుండా మార్కెట్లోకి వచ్చి కూరగాయలు అమ్మింది. విషయం అధికారులకు తెలియడంతో ఆమెను తీసుకెళ్లి ఐసోలేషన్ సెంటర్ లో చేర్చారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.