Huzurabad Corona : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ నియోజకవర్గంలో విజృంభిస్తోన్న వైరస్‌

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్‌ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్‌ పెడుతోంది.

Huzurabad Corona : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ నియోజకవర్గంలో విజృంభిస్తోన్న వైరస్‌

Huzurabad

Corona positive cases : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్‌ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్‌ పెడుతోంది. ఓవైపు పాజిటివ్‌ టెన్షన్‌.. మరోవైపు థార్డ్‌వేవ్‌ భయం.. ఇదిచాలదన్నట్లు.. పొలిటికల్‌ హడావిడి.. ఆ నియోజకవర్గ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో .. దగ్గర్లో ఉప ఎన్నికలు ఉండటంతో.. రాజకీయ పార్టీల హడావిడి పెరిగింది. నిత్యం ఏదో ఒక పార్టీ.. ఎవరో ఒక నేత ప్రచారం జరుగుతూనే ఉంది. గెలుపు తాపత్రయంతో వందలాది మందిని వెంటపెట్టుకుని నేతలు మీటింగ్‌లు.. ప్రచారాలు చేస్తుండటంతో.. స్థానికులు టెన్షన్‌ పడుతున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా.. మాస్క్‌లు ధరించకుండా ఎవరికి వారు తిరుగుతున్నారు. కరోనా వచ్చిన వారు సైతం బయటకు వస్తుండటంతో .. వైరస్‌ ఎప్పుడు అంటుకుంటుందోనని .. ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్య శాఖ అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. జిల్లాలో కోవిడ్ స్థితి గతులను తెలుసుకోవడానికి .. ఆరోగ్య శాఖ బృందం పర్యటించింది. గత వారం రోజుల క్రితం ఆరోగ్య శాఖ బృందం పర్యటించగా.. మరోసారి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హుజురాబాద్‌లో పర్యటించి.. కోవిడ్ వ్యాప్తి, హాస్పిటల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మెడికల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకుని అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి, రెండో డోస్ వ్యాక్సినేషన్ ఎలిజిబులిటి ఉన్న వారందరికీ .. నాలుగైదు రోజుల్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మికుంట హెల్త్ సెంటర్‌లో కోవిడ్ పేషంట్స్ కోసం ఐసోలేషన్, ఆక్సిజన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎచ్ శ్రీనివాసరావు తెలిపారు. పెరిగిన పొలిటికల్ హడావిడి పాజిటివ్ కేసులు పెరగడానికి కారణంగా డీహెచ్‌ చెప్తున్నారు.