ZP high school closed : హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్.. నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల మూసివేత

హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.

ZP high school closed : హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్.. నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల మూసివేత

Zp High School Corona

Nagol ZP high school closed : తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. పలు పాఠశాలల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, టీచర్స్ కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.

నిన్న నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు వణికిపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగితావారికి అధికారులు RTPCR పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన 38 విద్యార్ధులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన విద్యార్ధులను ఇళ్లకు పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపింది.