Vinod Kumar Corona : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా

ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Vinod Kumar Corona : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా

Vinod

Corona positive for Vinod Kumar : తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా బారిన పడ్డారు. జ్వరం, జలుబు ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను చేపట్టారు. శుక్రవారం (జనవరి 21) నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. తెలంగాణలోని అన్నీ జిల్లాలోని వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.

APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!

ఒక్కరోజు ఫీవర్ సర్వేలోనే 45వేల 567 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఏదొక లక్షణాలతో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితోపాటు ఏదొక లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య 45,567 మందిగా గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేశారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దవారిని విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు.

రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న లక్షా 20వేల 243 కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 4వేల 416 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు చనిపోయారు. నిన్నటి వరకు రాష్ట్రంలో కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 4,069కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 1,920 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29వేల 127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1670 కేసులు నమోదయ్యాయి.