Omicron Victim : రాజన్న సిరిసిల్ల ఒమిక్రాన్ బాధితుడి కుటుంబానికి కరోనా పాజిటివ్

భార్య, తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అయితే..వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి...జీనోమ్ సీక్వెన్సింగ్ కు...

Omicron Victim : రాజన్న సిరిసిల్ల ఒమిక్రాన్ బాధితుడి కుటుంబానికి కరోనా పాజిటివ్

Siricilla

Omicron In Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ కొత్తవేరియంట్ బారిన పడిన వ్యక్తి కుటుంబం కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతడు హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా..అతని భార్య, తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అయితే..వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి…జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరి గ్రామాన్ని సందర్శించిన వైద్యులు..బాధితులకు మనోధైర్యం కల్పించారు.

Read More : Covid Vaccination : మీరు ప్రభుత్వ ఉద్యోగులా..వ్యాక్సిన్ తీసుకోలేదా, జీతం రాదు

తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ దూసుకపోతోంది. రోజురోజుకు కేసుల పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 25 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.