CM KCR Corona Positive : సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

CM KCR Corona Positive : సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

Kcr

CM KCR : తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయన ఫాం హౌస్ లో క్వారంటైన్ లో ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని యశోదా వైద్యులు ఎం.వి.రావు బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో సీఎం కేసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న పలువురు నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు. భగత్, అంజయ్యలకు కరోనా వైరస్ సోకింది.

ఈ సందర్భంగా యశోదా ఆసుపత్రి వైద్యులు ఎం.వి.రావు 10tvతో మాట్లాడారు. జలుబు, మైల్డ్ గా పెయిన్స్ ఉన్నాయని, కేవలం 99.4 పాయింట్ల జ్వరం ఉందని..మూములుగా ఉన్నా..టెస్టులు చేయించడం జరిగిందని తెలిపారు. ఫాం హౌస్ లో ప్రశాంతంగా ఉండాలని, హోం ఐసోలేషన్ లో ఉండాలని తాము సూచించడం జరిగిందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం..సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తమ వైద్య బృందం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మాస్క్ ధరించడం, హోం ఐసోలేషన్ లో ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం..ఇతరత్రా జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని వైద్యులు ఎం.వి.రావు వెల్లడించారు.

Read More : ఏప్రిల్-26వరకు యూపీలోని 5నగరాల్లో లాక్ డౌన్