తెలంగాణలో కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్

తెలంగాణలో కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్

Corona second dose : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి డోస్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీ నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభించారు. మొదటి డోస్ తీసుకున్న వారు..28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోస్ వ్యాక్సినేషన్ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించాల్సి ఉంది.

హెల్త్‌కేర్‌ సిబ్బంది తరువాత ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు ఈ నెల 5 నుంచి వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నారు. మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, శానిటేషన్‌ తదితర విభాగాల వారు ఉన్నారు. ఈనెల చివరి వరకు వీరికి టీకాలు పూర్తి చేసి మార్చి మొదటివారంలో 50 ఏండ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోందని కేంద్రం వెల్లడిస్తోంది. మరోవైపు..నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 15 మందికి యూకే స్ట్రెయిన్‌ సోకినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 5,361 మంది బ్రిటన నుంచి భారత్‌ రాగా, వీరిలో 44 మందికి సాధారణ రకం కరోనా సోకగా,, 8 మందికి యూకే రకం స్ట్రెయిన్‌ నిర్ధారణ అయింది.