తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా చుట్టేస్తున్న కరోనా

  • Published By: vamsi ,Published On : September 16, 2020 / 07:26 AM IST
తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా చుట్టేస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లక్షణాలు లేకుండా చాపకింద నీరులా విస్తరిస్తోండడం ఆందోళన కలిగిస్తోన్న విషయం.




తెలంగాణలో కొత్తగా 2058 కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు 1,60,571. అయితే వారిలో ఎలాంటి లక్షణాల్లేకుండా కరోనాగా నిర్ధారణ అయినవారు 1,12,400 మంది. అంటే 70 శాతం మంది. ఇక దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో కరోనా పరీక్షల్లో కోవిడ్-19 వచ్చినట్లుగా తేలినవారు 48,171మంది. అంటే 30 శాతం మంది
https://10tv.in/dr-anthony-fauci-predicts-yearlong-intermission-between-corona-vaccine-arrival-and-maskless-in-india/
అయితే ఉపశమనం కలిగిస్తున్న విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారినవారి సంఖ్య 1,29,187కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో కోలుకున్న వారి శాతం 80.45. ఈ విషయంలో జాతీయ సగటు 78.26 శాతంగా ఉంది.



ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితి దారుణంగా మారిపోయింది. రోజుకు పది వేల కేసులు కూడా ఒక్కో రోజు నమోదు అవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 8,846 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. కొత్తగా వైరస్‌ బారినపడి 69 మôది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 5,041కి చేరుకుంది. మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 5,83,925గా ఉన్నాయి.