జీహెచ్ఎంసీలో కరోనా కలకలం.. ఉద్యోగులందరికి సెలవు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్(GHMC) కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తులో

జీహెచ్ఎంసీలో కరోనా కలకలం.. ఉద్యోగులందరికి సెలవు

Ghmc

Ghmc Corona : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్(GHMC) కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తులో ఉన్న చీఫ్‌ ఇంజినీర్‌ విభాగంలో ఇద్దరికి కరోనా సోకింది. అప్రమత్తమైన బల్దియా ఆ అంతస్తులోని ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. కరోనా కేసులు వచ్చిన ఫ్లోర్‌ను శానిటైజ్‌ చేయించింది.

తెలంగాణపై కరోనా పంజా:
తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 431 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది.

నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,676కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 228 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,352 ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 24,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటివరకు 7,86,426 మందికి డోస్‌ 1.. 2,24,374 మందికి డోస్‌ 2 టీకా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే డోస్‌ 1ను 39వేల 119 మందికి, డోస్‌ 2ను 3వేల 611 మందికి వేశారు.