Hyderabad Corona : హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఒకే అపార్ట్‌మెంట్‌లో 10మందికి పాజిటివ్.. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..

Hyderabad Corona : హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఒకే అపార్ట్‌మెంట్‌లో 10మందికి పాజిటివ్.. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి

Hyderabad Corona

Hyderabad Corona : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. అతడి నుంచి అపార్ట్ మెంట్ లోని మిగతావారికి కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్నారు. ఒకేసారి 10 కేసులు వెలుగుచూడటంతో అపార్ట్ మెంట్ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా అపార్ట్ మెంట్ లో ఉంటున్న అందరికీ ర్యాపిడ్ టెస్టులు చేయనున్నారు.

మరోవైపు అపార్ట్ మెంట్ లో శానిటైజేషన్ నిర్వహించారు అధికారులు. అపార్ట్ మెంట్ వాసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అయితే కరోనా సోకిన పది మంది ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వారిని హోం ఐసోలేషన్ లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. రేపటి కల్లా ఈ ప్రాంతంలో మొత్తం ఎన్ని కరోనా కేసులు వచ్చాయన్న అంశంపై స్పష్టమైన లెక్క వచ్చే అవకాశం ఉంది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

కాగా, ఆ వ్యక్తి ఢిల్లీ నుంచే వచ్చాడా? లేక ఇతర దేశం నుంచి వచ్చాడా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ అతను ఇతర దేశాల నుంచి వచ్చినట్లయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన వైరసా? అని నిర్ధారించేందుకు ప్రత్యేక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది

కరోనా తీవ్రత తగ్గిందని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో విరుచుకుపడుతోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోకి సైతం ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే దేశంలో నాలుగో ఒమిక్రాన్ కేసు ముంబైలో నమోదైంది. (కర్నాటకలో రెండు, గుజరాత్ జామ్ నగర్ లో ఒకటి, ముంబైలో ఒకటి) దక్షిణాఫ్రికా లోని కేప్ టౌన్ నుంచి దుబాయ్ – ఢిల్లీ మీదుగా మహారాష్ట్రలోని ముంబైకి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ప్రయాణికుడు కళ్యాణ్-డోంబివాలి మునిసిపల్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అతనితో పాటు ప్రయాణించిన 12మంది హై-రిస్క్ కాంటాక్ట్‌లుగా, మరో 23 మందిని తక్కువ రిస్క్ ఉన్న కాంటాక్ట్ లుగా అధికారులు గుర్తించారు. అయితే వారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి ఇంకా ఎంత మందిని కలిశాడు? అన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!

మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ సహా చార్మినార్ దగ్గర నిర్వహించే ‘ఫన్ డే’ వేడుకలను రద్దు చేసింది. సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపైనా ఆంక్షలు విధించింది. ప్రతీ ఒక్కరూ మాస్క్ ను విధిగా వాడాలనే ఆదేశాలను కచ్చితం చేసింది.

దీంతోపాటు వైరస్ హాట్ స్పాట్ లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్ పేట గంజ్, బేగం బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడి మల్కాపూర్, సరూర్ నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

తొలుత సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 38 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.