Corona Tension : కరోనా టెన్షన్.. ప్రభుత్వం అలర్ట్, నేటి నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.

Corona Tension : కరోనా టెన్షన్.. ప్రభుత్వం అలర్ట్, నేటి నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ

Corona Tension : కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. క్రమంగా కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. కొవిడ్ కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్రం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం అన్ని జిల్లాల్లో 1,571 కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సమీపాల్లో మొబైల్ వాహనాల ద్వారా టీకాల పంపిణీ జరగనుంది.

Also Read..Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

కాగా, రాష్ట్రంలో 1.60 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకోవాల్సి ఉంది. మరో 9 లక్షల మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాల్లోని స్టోరేజీ కేంద్రాల్లో 22,470 డోసుల కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు, సెంట్రల్‌ స్టోరేజ్‌ సెంటర్లలో 9.36 లక్షల డోసులు ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది.

ప్రికాషనరీ డోసు కోసం టీకా కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లోనూ మొబైల్‌ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్‌కు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సమీపాల్లో ప్రత్యేక వాహానాల్లో టీకాల పంపిణీ చేయనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

Also Read..Covid Tests In Airports : మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ.. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు

కరోనా పుట్టినిల్లు చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. చైనాలో కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఐసీయూల్లో చేరుతున్నారు. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. అక్కడ పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ చైనాలో విశ్వరూపం చూపిస్తోంది.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. జాగ్రత్తగా ఉండాలని, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకైనా మంచిదనే ఆలోచనతో బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కట్టారు. ఈ క్రమంలో కరోనా టీకా బూస్టర్ డోస్ కోసం తెలంగాణలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. బూస్టర్ డోస్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 46 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.