తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్, ఒకేసారి 10 లక్షల మందికి టీకా

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్, ఒకేసారి 10 లక్షల మందికి టీకా

Corona vaccination in Telangana : ఊహించినట్టే సంక్రాంతి పండగ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. వ్యాక్సినేషన్‌ను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేంది. ఇప్పటికే రెండు డ్రై రన్లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా 139 కౌంటర్ల ద్వారా టీకా ఇవ్వనున్నారు. ఒకేసారి 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది.

వ్యాక్సినేషన్ ముందుగా వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. 50 ఏళ్లు పైబడిన వారికి, చిన్న పిల్లలకు ప్రయార్టీ ప్రకారం వ్యాక్సిన్ ఇస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 90 వేల మంది వైద్య శాఖ సిబ్బంది ఉన్నారని.. 12 వందల సెంటర్లలో రోజుకు వంద మందికి చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజీలను కూడా సిద్ధం చేశామంది. ఇప్పటికే 3 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పెట్టేందుకు స్టోరేజీలు ఏర్పాటు చేయగా.. మరో 3 కోట్ల వ్యాక్సిన్లు వచ్చినా స్టోర్ చేసేలా ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

సంక్రాంతి పండగ సంబరాలు ముగియగానే కరోనా వ్యాక్సిన్ సంబరాలు మొదలు కానున్నాయి. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాధాన్యత క్రమంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ దిశగా కీలక అడుగు వేశామని మోదీ ట్వీట్ చేశారు.
కరోనా కోరల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే దిశగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సిద్ధమైంది.