Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ..తెలంగాణ 17వ ప్లేస్!

ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ..తెలంగాణ 17వ ప్లేస్!

Telangana Corona

Corona vaccination : ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్లోగా జరుగుతోంది. 60 ఏళ్లు పైబడినవారు కూడా టీకా వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటిదాకా జరిగిన వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్రప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

అత్యధికంగా వ్యాక్సినేషన్‌ జరిగిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తొలి మూడు స్థానాల్లో నిలవగా తెలంగాణ మాత్రం 17వ స్థానంలో నిలిచింది. ఏపీలో తెలంగాణ కంటే రెట్టింపు సంఖ్యలో వ్యాక్సినేషన్‌ జరిగింది. ఏపీలో ఇప్పటి వరకు 20 లక్షల 95 వేల మంది టీకా వేయించుకున్నారు.

తెలంగాణలో 10 లక్షలు కూడా దాటలేదు. కేవలం 9 లక్షల 36 వేల మంది మాత్రమే ఇప్పటిదాకా టీకా తీసుకున్నారు. ఇందులోనూ అత్యధిక మంది హెల్త్‌కేర్‌ వర్కర్లే ఉన్నారు. తెలంగాణలో మొదటిదశ టీకా 7 లక్షల మంది తీసుకోగా, రెండో దశలో 2 లక్షల 29 వేల మంది మాత్రమే తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో వ్యాక్సినేషన్‌ మరింత ఫాస్ట్‌గా చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More : Mumbai Night curfew : ముంబైలో నైట్ కర్ఫ్యూ : కరోనా కట్టడికి ఉద్ధవ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం