Corona Vaccine : గ్రేటర్ హైదరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు

రాష్ట్రంలో సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవ‌ర్ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.

Corona Vaccine : గ్రేటర్ హైదరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు

Corona Vaccine

corona vaccine for auto and cab drivers : రాష్ట్రంలో సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని వాహనాల డ్రైవ‌ర్ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ర‌వాణాశాఖ ఆధ్వ‌ర్యంలో ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు టీకాలు ఇస్తున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప‌రిధిలో 10 కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకాల పంపిణీ కొన‌సాగ‌నుంది. టీకాలు వేయించుకునే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్సీ జీరాక్స్ కాపీ తీసుకురావాల‌ని అధికారులు సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ ప‌రిధిలో 3 ల‌క్ష‌ల‌కుపైగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు ఉన్నారు.

కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే సూపర్ స్ప్రెడర్స్ ను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వివిధ రంగాలకు చెందిన 7 లక్షల 75 వేల మంది సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్లు వేస్తోంది. కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు బస్సు, క్యాబ్, ఆటో డ్రైవర్లు. ఫ్రంట్ లైన్ వర్కర్ల హోదా పొందిన ఆటో డ్రైవర్లు ఈ నెల 3 నుంచి కరోనా టీకాలు వేయించుకోవచ్చని ప్రకటించింది.