తెలంగాణలో రెండోసారి కరోనా వైరస్, ఉస్మానియాలో ఇద్దరు జుడాలకు పాజిటివ్!

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 06:38 AM IST
తెలంగాణలో రెండోసారి కరోనా వైరస్, ఉస్మానియాలో ఇద్దరు జుడాలకు పాజిటివ్!

తెలంగాణలో కరోనా వైరస్‌ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్‌ అయిన వారిలో చాలా మైల్డ్‌ సిమిటమ్స్‌ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు.



ఇప్పటికే ఈఎస్‌ఐ ఆస్పత్రిలో డీన్‌ స్థాయిలో పనిచేస్తోన్న అధికారికి కరోనా మొదటిసారి అటాక్‌ చేసినప్పుడు త్వరగా కోలుకున్నారు. అయితే అనుకోకుండా తనకి రెండోసారి కూడా అటాక్‌ అయ్యింది. దీంతో కాస్తా ఆందోళన చెందిన ఆ వైద్యుడు సరైన ట్రీట్‌మెంట్‌తో త్వరగా కోలుకున్నారు. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకు … వైరస్‌ రెండోసారి పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది.
https://10tv.in/according-to-the-neck-survey-2-crore-eatings-egg-demand-in-telangana-state/
గ‌తంలో ఇత‌ర దేశాల్లో కూడా రెండోసారి వైర‌స్ చాలా మందిపై అటాక్‌ చేసింది. మన దేశంలో కూడా అలా అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎక్కడా సమస్య తలెత్తలేదని నిమ్స్‌ వైద్యులు అంటున్నారు.



ఆల్రెడీ ఒకసారి వైరస్ అటాక్ అయిన తరువాత వారిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందితే సమస్య ఉత్పన్నం కావడం లేదు. కాకపోతే పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినప్పటికీ వైరస్ తాలూకు అవశేషాలు ఉండటంతో మళ్ళీ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా .. వైరస్‌ మరోసారి పాజిటివ్‌ వచ్చే చాన్స్‌ మాత్రం ఉంది.
రెండోసారి వైర‌స్ అటాక్‌ చేసినప్పుడు లక్షణాలు మాత్రం చాలా మైల్డ్‌గా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు.




తెలంగాణలో ఇలా రెండోసారి అటాక్‌ అయిన కేసులు చాలా తక్కువే. సెకండ్‌ టైమ్‌ వైరస్‌ పాజిటివ్‌ వస్తోందని జరుగుతున్న ప్రచారంతో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్యులు కోరుతున్నారు. రెండోసారి వైరస్‌ పాజిటివ్‌ వస్తే.. అసలు వర్రీ కావద్దని చెబుతున్నారు. త్వరగా కోలుకోవడానికే అవకాశాలు ఎక్కువని తేల్చి చెప్తున్నారు.