INDIAలో Coronavirus సెకండ్ వేవ్ మొదలైపోయిందా.. CHINAను దాటేస్తామంటోన్న గణాంకాలు

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 06:31 AM IST
INDIAలో Coronavirus సెకండ్ వేవ్ మొదలైపోయిందా.. CHINAను దాటేస్తామంటోన్న గణాంకాలు

ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కరోనా second wave లక్షణాలు కనిపిస్తున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, గోవాలలో కొత్త కేసులు నమోదు దాదాపు తగ్గిపోయాయనుకున్నారు. కొద్ది వారాలుగా సున్నా కేసులతో ఉన్న ఈ రాష్ట్రాల్లో గత వారం కరోనా లక్షణాలు కనిపించాయి. గోవాలో నెల రోజులుగా సింగిల్ కేసు కూడా లేదు. గోవాలో కరోనాకు గురైన ఏడుగురికి ట్రీట్‌మెంట్ ఇప్పించి ఇళ్లకు పంపేశారు. 

ఇదిలా ఉంటే రెండ్రోజులుగా ఎనిమిది కొత్తకేసులతో అలజడి మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి గోవాకు చేరుకున్న వారి ద్వారానే కొత్తకేసులు మొదలైయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి. నెలలోని మొదటి వారం 41మంది కరోనా అనుమానితులను గుర్తించగా 34మందికి కన్ఫామ్ అయింది. 

కేరళ కరోనా కేసులు నమోదుకావడం తగ్గనే లేదు. కానీ, అది సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. గురువారం ఒక్కసారిగా 26కొత్త కేసులు నమోదు కావడంతో మరోసారి రాష్ట్రం ఉలిక్కిపడింది. మార్చి 30 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. శుక్రవారం మరో 16కేలు నమోదై.. 52కేసులకు చేరాయి. వీటితో 576కరోనా ఇన్ఫెక్షన్లు కన్ఫామ్ అయ్యాయి. 

ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుంది. కేరళలో 22మంది గల్ఫ్ దేశాలను వచ్చిన వారికే పాజిటివ్ గా నమోదైంది. గత వారం అస్సాంలో 40కేసులు నమోదయ్యాయి. 45మంది పేషెంట్లు రికవరీ అయి వెళ్లాక కొత్త కేసులు గుర్తించారు. 

రాబోయే రోజుల్లో కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. పని చేసుకునే వారు తిరిగి రావడమే ఒడిశా, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కేసులు పెరగడానికి కారణం. ఈ కారణంతోనే రైళ్లను తమ రాష్ట్రాల్లోకి అనుమతివ్వడం లేదు. 

శుక్రవారం నమోదైన కేసులతో ఇండియా కేసుల సంఖ్య చైనాకు సమానమైంది. 84వేల 649కేసులతో చైనా ఉండగా గత 2నెలలుగా ఒక్క కేసు కూడా అక్కడ నమోదుకాకపోవడం గమనార్హం. కొద్ది రోజులుగా భారత్ లో రోజుకు 4వేల కేసులు నమోదవుతున్నాయి. మార్చి 1తోనే 80వేల సంఖ్య చేరుకున్న చైనా.. కొత్త కేసుల నమోదు కావడాన్ని భారీగా నియంత్రించగలిగింది. 

రెండున్నర నెలల్లో నమోదైంది 4వేల 500కేసులే. ఇదిలా ఉంటే జనవరిలో కేరళలో నమోదైంది 3కేసులే. భారత్ లో తొలి కేసు నమోదయ్యే సమయానికే చైనా 80వేలు కరోనా పేషెంట్లను నమోదు చేసుకుంది. శుక్రవారానికి ఇండియాలో కరోనా కేసులు 85వేల 68కాగా, 31వేల మంది రికవరీ అయ్యారు. దేశంలో నమోదైన మృతుల సంఖ్య 2వేల 750.

Read Here>> భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు