రాజధానిలో రెడ్ జోన్ ప్రాంతాలివే..ఇంటికే రేషన్..వస్తువులు

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 01:20 AM IST
రాజధానిలో రెడ్ జోన్ ప్రాంతాలివే..ఇంటికే రేషన్..వస్తువులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 కేసులు నమోదు కాగా..ఒకరు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే..ఈ వైరస్ ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు.

ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోవాలని సూచిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో కరోనా బాధితులున్న ప్రాంతాలను ‘కొవిడ్ – 19 క్వారంటైన్డ్ జోన్’గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించాయి. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్లల్లోని బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అయ్యో..నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు అవసరం పడితే.. ? ఎలా అని అనుకుంటున్నారా ? ఇంటి వద్దకే పంపిస్తామంటున్నారు. 

రంగారెడ్డి జిల్లాలోని చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజాల్, కొత్త పేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. బాధితుడు నివాసం ఉండే కాలనీలోని కిలో మీటర్ పరిధిలో రోడ్ జోన్ గా ప్రకటించారు. 

క్వారంటైన్ లో ఉండే అన్నీ రోజులు వీరికి ఇంటి వద్దకే రేషన్, ఇతరత్రా సామాగ్రీని అందచేయడం జరుగుతుందని అంటున్నారు. వీరికి మందులు, ఇతరత్రా అవసరాల కోసం స్థానికంగా ఉన్న సిబ్బందిని ఏర్పాటు చేశారు. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి..అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయనున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అధికారులు భావిస్తున్నారు.