నిర్మల్ జిల్లాలో కరోనా కలకలం : వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ 

నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు. 

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 01:36 PM IST
నిర్మల్ జిల్లాలో కరోనా కలకలం : వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ 

నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు. 

నిర్మల్ జిల్లాలో కరోనా అనుమానిత కేసు కలకలం రేపింది. వైరస్ తో జిల్లా ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు. బాధితుడు దుబాయ్ నుంచి వచ్చాడని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. 

మండలంలోని ముజిగి గ్రామానికి చెందిన తోట మహిపాల్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయితే నాలుగు రోజులుగా తీవ్రమైన జలుబు, వాంతులు, దగ్గుతో బాధపడుతున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహిపాల్‌ను పరీక్షించిన డాక్టర్ రాజేందర్.. ఆయనకు కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మెరుగైన చికిత్స కోసం శనివారం (మార్చి 7, 2020) ఉదయం ముజిగి ప్రాంతీయ ఆస్పత్రి నుంచి నిర్మల్ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు మహిపాల్‌ను నిర్మల్‌ వైద్యులు పరిశీలించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కొద్ది సేపటికి అతని పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బంది బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు. 

ప్రస్తుతం మహిపాల్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతని కోసం కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది వెతుకుతున్నారు. కరోనా వైరస్‌ సోకిందనే భయంతోనే ఆయన ఆస్పత్రి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.