మినీ మేడారం జాతరలో కరోనా, ఆలయ సిబ్బందికి వైరస్ ?

మినీ మేడారం జాతరలో కరోనా, ఆలయ సిబ్బందికి వైరస్ ?

Mini Medaram : ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకిందనే ప్రచారం జరగుతోంది. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే..వైరస్ వ్యాపించిందని అంటున్నారు. అయితే..సిబ్బందికి వైరస్ సోకిందా ? లేదా ? అనే విషయంపై మేడారం దేవాలయ ఉన్నతాధికారులు ధృవీకరించడం లేదు. కరోనా కేసులు నమోదు కావడంతో..దేవాలయ సిబ్బంది, భక్తుల్లో భయం నెలకొంది. టెస్టులు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు ధృవీకరించే అవకాశం ఉంది.

మేడారం మినీ జాతర ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగుతుంది. ఈ జాతరకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే..ఇక్కడకు వచ్చే వారు కనీస ముందస్తు జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న అనంతరం జాతరను నిర్వహిస్తే..బాగుంటందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్ వ్యాపిస్తుండడంతో స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రణాళిక లోపం వల్లే..సిబ్బందికి కరోనా వచ్చి ఉంటుందని అంటున్నారు.

మినీ మేడారం జాతర 2021, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం గట్టమ్మ వద్ద అమ్మవారిని దర్శించుకుని, మేడారంలో సమ్మక్క – సారలమ్మలకు చీరె పెట్టి పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటించి, అమ్మవార్ల దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.