CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు?

మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన పట్ల తీరుపట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి ఘన స్వాగతం పలికారు.

CM KCR: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు?

Kcr

CM KCR: మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన తీరుపట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. య‌శ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క‌ స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాల పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ హైదరాబాద్ వస్తున్నారు. తమకు వ్యతిరేకంగా చాలా చెబుతారు. గొంతు చించుకొని ఎన్ని ఆరోపణలు చేసినా తమకు వచ్చే నష్టం ఏమీలేదంటూ కేసీఆర్ అన్నారు. మమ్మల్ని ఎన్నైనా అననీ.. కానీ తాము వేసిన ప్ర‌శ్న‌ల‌కు హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీ స‌మాధానాలు చెప్పాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్

టార్చిలైట్ వేసి వెతికినా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీకూడా నెరవేర్చినట్లు క‌నిపించ‌డం లేద‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర స‌ర్కారు డీజిల్ స‌హా అన్ని ధ‌ర‌లు పెంచేసింద‌ని మండిప‌డ్డారు. ఇవి చాల‌ద‌న్న‌ట్లు న‌ల్ల‌ చ‌ట్టాలు తెచ్చి రైతుల‌ను ఇబ్బందిపెట్టార‌న్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రైతులు సుదీర్ఘ పోరాటం చేశార‌ని, ఉద్య‌మంలో కొంద‌రు రైతులు మృతిచెందార‌న్నారు. వారి కుటుంబాల‌కు తాము రూ. 3 ల‌క్ష‌లు ఇస్తే, బీజేపీ త‌మ‌ను చుల‌క‌న‌గా చూసింద‌ని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 70వేల టీఎంసీల నీటి లభ్యంత ఉందని, కానీ ప్రజలకు కనీసం తాగునీరు అందించలేక పోతున్నారని, దేశ రాజధాని ఢిల్లీలో కూడా గుక్కెడు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ అన్నారు.

Yashwant Sinha: నాడు అలా.. నేడు ఇలా.. హైదరాబాద్‌లో అడుగిడనున్న యశ్వంత్ సిన్హా

100 సీట్ల మెజార్టీ మాకుందని, కానీ కేంద్ర మంత్రులు తెలంగాణ వచ్చి మహారాష్ట్రలోలా మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మాట్లాడుతున్నారని, మేం కూడా మిమ్మల్ని ఢిల్లీలో కూల్చేయడానికి చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. సంక్షోభం నుంచే విప్లవం పుడుతుంది. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ 60ఏళ్లు పోరాడింది, మరో యుద్ధం చేయాల్సి వస్తే తెలంగాణ సమాజం వెనుకడుగు వేయదంటూ కేసీఆర్ అన్నారు.

Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్

నరేంద్ర మోదీ వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ పరువు పోతోందని కేసీఆర్ అన్నారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు జరుగుతున్నాయో, రేపటి సభలో మోదీ చెప్పాలంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. శ్రీలంక విషయంలో మోడీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడని అన్నారు. మోదీ ఒత్తిడి వల్లే పవర్ కాంట్రాక్ట్ ను భారతీయ వ్యాపారికి ఇవ్వాల్సి వచ్చిందని శ్రీలంక పార్లమెంట్ లో ప్రకటించారని కేసీఆర్ గుర్తు చేశారు. మోదీ తీరుతో అంతర్జాతీయ వేదికలపై భారత్ చులకన అవుతోందని అన్నారు.

Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

జాతిపతి గాంధీని మీ కళ్లముందే అవమానిస్తున్నా కళ్లప్పగించి చూస్తారంటూ మోదీ తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. జాతిపితను అవమానిస్తున్న వారిని ఎందుకు నియంత్రించరు అంటూ ప్రశ్నించారు. అమెరికా వెళ్లారు.. ఆబాకీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు, ట్రంప్ ను ఇంటికి సాగనంపారన్నారు. ఓ దేశ ప్రధాని ఇతర దేశాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మోడీ.. అహ్మదాబాద్ మున్సీపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. రూపాయి ప‌త‌నం చూస్తే మోదీ పాల‌న ఏంటో అర్థ‌మవుతోంద‌న్నారు. మోదీ షావుకార్ల సేల్స్‌మేన్ అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబ‌ద్దమ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీతో త‌న‌కు వ్య‌క్తిగ‌త విభేదాలు లేవ‌న్నారు. మోదీ విధానాల‌తోనే త‌మ‌కు అభ్యంత‌ర‌మ‌ని పేర్కొన్నారు. తాము మౌనంగా ఉండ‌బోమ‌ని, పోరాటం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.