నో మాస్క్ – నో ఓట్ : దుబ్బాక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు

  • Published By: sreehari ,Published On : November 3, 2020 / 10:46 AM IST
నో మాస్క్ – నో ఓట్ : దుబ్బాక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు

No mask no vote-Dubbaka polling : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. నో మాస్క్.. నో ఓటు అంటూ పూర్తి జాగ్రత్తలతోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర శానిటైజర్లు, మాస్క్‌లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఓటు వేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



మాస్క్ లేకుండా ఓటు వేసేందుకు అధికారులు అనుమతించడం లేదు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ సూచిస్తున్నారు. చేగుంట మండలంలోని కరణంపల్లిలో పోలింగ్ కేంద్ర దగ్గర ఉదయం 45 నిమిషాల పాటు ఈవీఎం మెరాయించింది.



https://10tv.in/woman-refuses-to-wear-mask-on-plane-coughs-on-passengers-yells-everyone-dies-when-deplaned/
కోవిడ్ భద్రతా ప్రమాణాలతో పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓటర్లు భారీ క్యూలో నిలబడ్డారు. పోలింగ్ కేంద్ర దగ్గరకు వచ్చే ప్రతి ఓటరుకు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించగానే.. శానిటైజ్ చేయడంతో పాటు చేతులకు గ్లౌజులు ఇచ్చి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తున్నారు.



ఒక మీటర్ దూరంలో ఉండేలా మార్కింగ్ గీసి సామాజిక దూరాన్ని పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నలుగురికి 99 డిగ్రీల జ్వరం ఉండటంతో వారిని సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు.