పండుగలపై కరోనా ఎఫెక్ట్, మొహర్రంకు షరతులు

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 10:34 AM IST
పండుగలపై కరోనా ఎఫెక్ట్, మొహర్రంకు షరతులు

పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఎంతో అట్టహాసంగా..సంబరంగా జరుపుకొనే పండుగలను సాధారణంగా జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో పండుగలన్నీ కళ తప్పాయి.



మార్చి నెల నుంచి వైరస్ విస్తరిస్తూనే ఉంది. మార్చి – ఆగస్టు నెలలో వచ్చిన పండుగలన్నీ ఇంట్లోనే జరుపుకున్నారు. ఆగస్టులో వచ్చిన వినాయక చవితిపై కూడా నిబంధనలు పాటించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. విగ్రహాలు మూడు అడుగులకు మించకూడదంటూ స్పష్టమైన ఆంక్షలు విధించారు.

కరోనా కేసులు గ్రామాల్లో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా మండపాల్లో ఎలాంటి డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.



ఇక ఈ నెలలో మొహర్రం పండుగ వస్తోంది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించారు. మొహర్రంను జాగ్రత్తలతో జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాటించే సంతాప దినాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించింది.

షర్బత్‌ లేదా ఉచిత మంచినీటి పంపిణీని సీల్డ్‌ ప్యాకెట్లలో మాత్రమే ఇవ్వాలన్నారు. ముత వల్లీలు, ముజావర్లు, మేనేజింగ్‌ కమిటీలను అనుమతించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో లేఖ రాశారు.



పీర్ల చావిడ్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఆలంల ఏర్పాటు, అగ్ని గుండాలను అనుమతించాలని సూచించారు.