Updated On - 11:09 am, Tue, 3 November 20
By
sreehariTelangana Covid-19 Live Updates : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. వెయ్యి వరకు నమోదైన కరోనా కేసులు.. గత 24 గంటల్లో 1,536 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. 1,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మరో ముగ్గురు మృతిచెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కు చేరుకుంది.
కరోనా మరణాల రేటు భారత్ వ్యాప్తంగా 1.5 శాతంగా నమోదైంది. తెలంగాణలో 0.55 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా రికవరీ రేటు 91.7 శాతంగా నమోదైంది. తెలంగాణలో 92.12 శాతానికి రికవరీ రేటు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 17,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు 2,23,413 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 1,351 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 281 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
షర్మిల దీక్షకు ముగిసిన గడువు.. భారీగా మోహరించిన పోలీసులు
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
Telangana Election Notification : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Telangana Exams : తెలంగాణలో పరీక్షలు జరిగేనా?
Covid-19: నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేసేందుకు భయపడుతున్న వైద్యులు
Covid-19: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే