Covid 19 Situation : కోవిడ్ – 19 పరిస్థితి..రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్..తెలంగాణ బెటర్

కోవిడ్ 19 పరిస్థితి సూచిక విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచిక ఎంచుకున్న రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని ప్రకటించింది.

Covid 19 Situation : కోవిడ్ – 19 పరిస్థితి..రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్..తెలంగాణ బెటర్

Covid States

Ranking Between States : కోవిడ్ 19 పరిస్థితి సూచిక విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచిక ఎంచుకున్న రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని ప్రకటించింది. వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆసుపత్రులల్లో మౌలిక సదుపాయాలు, మందులు ఆక్సిజన్, ట్రీట్మెంట్ అంశాలపై మ్యాట్రిక్స్ రేటింగ్స్ ను జాతీయ స్థాయిలో రిలీజ్ చేశారు. అందులో తెలంగాణ బెటర్ ప్లేస్ లో ఉన్నట్టు ప్రకటించారు.

నాలుగు విభాగాలుగా రాష్ట్రాల స్థితులను పేర్కొన్నారు. ఆయా రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, మందులు, ఆక్సిజన్, వైద్య సదుపాయం వంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలను 4 కేటగిరీలుగా విభజించారు. ఇందులో రాష్ట్రాలను బెటర్, ఆవరేజ్, పూర్, వెరీ పూర్ గా పేర్కొన్నారు.

తెలంగాణ బెటర్ పొజిషన్ లో ఉంటే… పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ యావరేజ్ గా ఉన్నాయి. ఈ రాష్ట్రాలు పోగా మిగిలిన వాటిల్లో కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జమ్ము కాశ్మీర్, ఒడిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్ లో… పూర్ సిచువేషన్ ఉంది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, సతీష్ ఘడ్ రాష్ట్రాలు వెరీపూర్ స్థానాన్ని దక్కించుకున్నాయి.

తెలంగాణలో కరోనా :-
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2 వేల 955కు చేరుకుంది. వైరస్‌ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్స నుంచి కోలుకున్నారు. 4 లక్షల 74 వేల 899 మంది కోలుకున్నట్లైంది. మొత్తం పాజిటివ్‌ కేసులు 5,28,823కు పెరిగాయి. యాక్టివ్‌ కేసులు 50,969కి చేరాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా : –
24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 2, 10, 436 యాక్టివ్ కేసులు ఉండగా..9 వేల 372 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 21, 101 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,79,75,305 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

Read More : Palestinians : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 37మంది మృతి..ఇజ్రాయెల్ పై 3వేల రాకెట్లు ఎక్కుబెట్టిన గాజా