తెలంగాణలో ‘ప్రైవేటు’ కరోనా వ్యాక్సిన్.. ధర ఎంతంటే?

తెలంగాణలో ‘ప్రైవేటు’ కరోనా వ్యాక్సిన్.. ధర ఎంతంటే?

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధరపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా టీకాను ఎంత ధర నిర్ణయిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మార్చి ఒకటి నుంచి తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధరకు అందిస్తారనే టాక్ వినిపిస్తోంది. రెండో విడత టీకాలో భాగంగా 60ఏళ్లు పైబడినవారితో పాటు 45ఏళ్ల నుంచి 60ఏళ్ల లోపు వారికి కూడా టీకా వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

వీరిలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ టీకా వేయించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ప్రైవేట్, కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే టీకా వేసేందుకు అనుమతి ఉంది. ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం కరోనా టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్రం సూచించిన ఏజ్ గ్రూపు వారిలో ఎవరైనా సరే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నగదు చెల్లించి టీకా తీసుకోనే అవకాశాం కల్పించింది.

అలా అని వ్యాక్సిన్‌ బహిరంగ మార్కెట్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రూ.300 నుంచి రూ.400 మధ్య ధర ఉండొచ్చునని తెలిపారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఫ్రీగా టీకాలు అందిస్తోంది. ఈ టీకా ప్రొగ్రామ్ ను ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు కోవిణ్ యాప్‌ను పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తోంది. టెక్నికల్ ఇష్యూను రిజాల్వ్ చేసి కొత్త మార్పులతో రెండో వెర్షన్ ప్రవేశపెట్టనుంది.

వ్యాక్సినేషన్ అనంతరం తప్పనిసరిగా వారి పేరు, వివరాలను యాప్ డేటాలో నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఎన్ని టీకాలు వేశారో నమోదు చేయాల్సి ఉంటుంది. టీకా వేసే సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌, కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సిందిగా పలు సూచనలు చేశారు.