Covid Isolation Centers : గ్రేటర్​ హైదరాబాద్‌లో కోవిడ్‌ ఐసోలేషన్ సెంటర్లు…ఇంట్లో వసతులు లేని పేషెంట్లు ఉండేందుకు అవకాశం

గ్రేటర్ హైదరాబాద్‌లో కోవిడ్‌ పేషెంట్లకు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కరోనా సెకండ్​వేవ్‌తో కేసులు పెరుగుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది.

Covid Isolation Centers : గ్రేటర్​ హైదరాబాద్‌లో కోవిడ్‌ ఐసోలేషన్ సెంటర్లు…ఇంట్లో వసతులు లేని పేషెంట్లు ఉండేందుకు అవకాశం

Covid Isolation Centers

covid Isolation Centers in Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో కోవిడ్‌ పేషెంట్లకు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కరోనా సెకండ్​వేవ్‌తో కేసులు పెరుగుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్​వచ్చి ఇంట్లో ఉండేందుకు వీలు లేని వారు ఈ ఐసోలేషన్ సెంటర్లలో ఉండేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూల్స్, కమ్యూనిటీ, ఫంక్షన్ హాల్స్, ఇండోర్ స్టేడియాల్లో అధికారులు ఐసోలేషన్​సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే హైటెక్స్‌లోని NCA కోవిడ్ ఐసోలేషన్‌ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవితి, సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ ఐసోలేషన్‌ సెంటర్ ఏర్పాటులో జీహెచ్‌ఎంసీతో పాటు.. పోలీస్‌ శాఖ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ స్వచ్ఛంద సంస్థ భాగస్వామయ్యాయి. మొత్తం 200 బెడ్స్‌తో ఈ ఐసోలేషన్‌ కేంద్రాన్ని సిద్ధం చేశారు.

చిన్న కుటుంబాలలో ఒకరికి కరోనా వస్తే కుటుంబ సభ్యులంతా వైరస్ బారిన పడుతున్నారు. సింగిల్ రూమ్స్, బెడ్రూం ఉన్న ఇళ్లలో కరోనా వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండటం సాధ్యం కాని పని. ఇలాంటి కుటుంబాల్లో ఒకరికి కరోనా వస్తే ఇంట్లోని వారందరికీ పాజిటివ్ వస్తోంది. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ ఉంటే కుటుంబ సభ్యులను ఇంట్లో ఉంచి కరోనా వచ్చిన వారు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు. దీనివల్ల ఇంట్లోని మిగతావారికి కరోనా వ్యాప్తి కాకుండా ఉంటుందని.. ఈ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్లతో కరోనాను కట్టడి చేయవచ్చని భావిస్తోంది జీహెచ్‌ఎంసీ.

ఐసోలేషన్​ సెంటర్‌కి పాజిటివ్‌తో వచ్చిన వారు.. నెగెటివ్​రిపోర్టుతోనే ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి సెంటర్‌లో బెడ్స్, ఎమర్జెన్సీ అయితే వినియోగించేందుకు ఆక్సిజన్, హెల్త్​ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండనున్నారు. పేషెంట్​ పరిస్థితి ఒకవేళ సీరియస్​ అయితే ఇతర హాస్పిటల్స్​లో అడ్మిట్​ చేయనున్నారు. అత్యవసరం కోసం మాత్రమే హెల్త్​స్టాఫ్‌ని ఉంచనున్నారు.