Telangana : 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ

తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ కానున్నాయి. దీనికి సంబంధించి డీహెచ్ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుప్రత్రుల్లో కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కరోనా చికిత్స పేరుతో బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును 2 వారాల్లో చెల్లించాలని డీహెచ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Telangana : 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ

Telangana

Covid license renewal for 22 private hospitals In Telangana : తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ కానున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుప్రత్రుల్లో కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో గతంలో కరోనా చికిత్స పేరుతో బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును 2 వారాల్లో చెల్లించాలని డీహెచ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును చెల్లించిన తరువాత తిరిగి ఆయా ఆసుప్రతుల్లో కరోనా చికిత్సలు చేయవచ్చని పేర్కొంది.

అంతేకాకుండా తిరిగి అనుమతులు ఇచ్చాం కదాని మరోసారి బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంట్లో భాగంగా సదరు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని..క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.కాగా కరోనా రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు భారీగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను దోపిడీ చేయటంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటువంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.