స్కూళ్లు బంద్.. మళ్ళీ లాక్‌డౌన్?

కరోనా ఎఫెక్ట్‌తో.. నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లు బంద్.. మళ్ళీ లాక్‌డౌన్?

Lockdown Telangana

కరోనా ఎఫెక్ట్‌తో.. నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండగా.. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, హాస్టళ్లు తదితర విద్యాసంస్థలన్నీ నుంచి మూసివేయాలని.. వైద్య కళాశాలలు మాత్రం పనిచేస్తాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.

విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు కొనసాగనున్నాయి. దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోండగా.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పరిస్థితులపై సమీక్షించిన సర్కార్‌.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు అన్నిటినీ తాత్కాలికంగా మూసివేయాని నిర్ణయించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ను కంట్రోల్ చేయడానికి, మహారాష్ట్ర లాంటి పరిస్థితి మన దగ్గర రిపీట్ కాకుండా యాక్షన్‌ ప్లాన్‌ మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్. ఇటీవలి కాలంలో తెలంగాణలో కరోనా డైలీ కేసులు నాలుగు వందలు దాటాయి.. ఇంకో ఎనిమిది వందలకు పైగా రిపోర్టులు రావాల్సి ఉండగా.. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోనుంచి బయటకు రావొద్దని తెలంగాణ వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ లాక్‌డౌన్ విధించాలని బావిస్తోంది.