Covid War : ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను తెలంగాణలోకి అనుమతివ్వని పోలీసులు

తెలంగాణ, ఏపీ మధ్య కరోనా చిచ్చు కొనసాగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు.. సరిహద్దుల నుంచే వెనక్కి పంపడం దుమారాన్ని రేపుతోంది.

Covid War : ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను తెలంగాణలోకి అనుమతివ్వని పోలీసులు

Covid War

covid War on AP-Telangana border : తెలంగాణ, ఏపీ మధ్య కరోనా చిచ్చు కొనసాగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు.. సరిహద్దుల నుంచే వెనక్కి పంపడం దుమారాన్ని రేపుతోంది. అయితే.. ఆస్పత్రుల్లో బెడ్స్‌ బుక్ చేసుకోకుండా వస్తున్న వారినే ఆపుతున్నామంటున్నారు తెలంగాణ పోలీసులు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశల్‌ మధ్య కరోనా తీవ్ర ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వెంటాడుతోంది. ఈ సమయంలో ఏపీ నుంచి భారీగా ప్రైవేట్ అంబులెన్స్‌లు హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు రోగులను తరలించాయి. రోజుకు ఏపీ నుంచి తెలంగాణకు మూడు వందల అంబులెన్స్‌లు ప్రయాణం సాగిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బెడ్ల కొరత ఏర్పడుతోంది.

అయితే.. ఏపీ నుంచి వచ్చే వారిలో ఎక్కువ మందికి హైదరాబాద్ ఆస్పత్రుల్లో అడ్మిషన్, బెడ్ లేదనే వాదన ఉంది. దీంతో.. ఆస్పత్రి నుంచి లెటర్, బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. లేకుంటే.. వాటిని వెనక్కి పంపిచేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి చాలా మందినే వెనక్కి పంపించేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ దగ్గర కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లోనే నిలిపివేశారు.

తెలంగాణలో బెడ్స్‌ ఖాళీలేవని ఏదైనా ఆస్పత్రి నుంచి అంగీకార పత్రం తీసుకువస్తేనే పంపిస్తామని సూచిస్తున్నారు. దీంతో.. అనంతపురం నుంచి వస్తున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు, కడపకు చెందిన మరో బాధితుడు కర్నూలు జిల్లా సర్వజనీన ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.

అటు మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని సైతం మూసివేశారు తెలంగాణ పోలీసులు. కామారెడ్డి జిల్లా సలాబత్‌పూర్‌ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వాహనాలు తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. కరోనా దృష్ట్యా వాహనదారులు సహకరించాలన్నారు పోలీసులు.