భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్ వెళ్లొచ్చు : సీపీ అంజనీకుమార్

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 11:45 AM IST
భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్ వెళ్లొచ్చు : సీపీ అంజనీకుమార్

bandi Sanjay bike rally CP Anjanikumar respond : చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్ వెళ్లొచ్చని సీపీ అంజనీకుమార్ అన్నారు. ఆయనను తాము ఆపడం లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ కు అనుమతి లేదంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. హైదరాబాద్ పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకోరని సీపీ స్పష్టం చేశారు.



ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ర్యాలీలు, ఆందోళనలకు మాత్రం అనుమతి లేదని తెలిపారు. భాగ్యలక్ష్మీ దేవాలయానికి ఎవరైనా వెళ్లొచ్చన్నారు. గుడికి వెళ్లే వారిని ఎవరినీ ఆపబోమని తేల్చి చెప్పారు.



ఎన్నికల కమిషనర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయడంపై వివాదం నెలకొంది. అయితే లేఖ తాను రాయలేదని బండి సంజయ్ చెబుతున్నారు. లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.



బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీకి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. కాగా ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన సమయానికి ఆలయానికి వస్తానని సంజయ్ చెప్పారు.



నేడు శుక్రవారం కావడం, ముస్లింలు నమాజ్‌కు వచ్చే టైం కావడంతో.. ర్యాలీ సమయంలో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుందో అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. ముందస్తుగా బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వెళ్లే ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పాతబస్తీలో టెన్షన్ నెలకొంది.