Narayana Agnipath : ప్రధాని మోదీ నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు-సీపీఐ నారాయణ

ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. సాయుధ దళాల నియామకాల్లో పాతపద్ధతినే కొనసాగించాలి.

Narayana Agnipath : ప్రధాని మోదీ నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు-సీపీఐ నారాయణ

Narayana Agnipath

Narayana Agnipath : ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్.. అగ్గి రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది. నిరసనకారులు ట్రైన్లకు నిప్పు పెట్టారు. బోగీలు ధ్వంసం చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు.

”సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లలో ఒకరు మృతి చెందడం సర్కారీ హత్యే. పీఎంవోపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. యువకుడు చనిపోవడం బాధాకరం. అతడి త్యాగం, వీరోచిత పోరాటం వృథా పోదు. ప్రభుత్వం ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలి. నిరుద్యోగులను మభ్యపెట్టే దుష్ట ఆలోచనతోనే అగ్నిపథ్ విధానాన్ని తీసుకువస్తున్నట్టుంది. మరోవైపు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మోసపూరితమైనది” అని నారాయణ మండిపడ్డారు.(Narayana Agnipath)

Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం : మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌..

సైనిక నియామక విధానాన్ని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నారాయణ ప్రశ్నించారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని, జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు అదే కారణమని స్పష్టం చేశారు. కేంద్రం ఇకనైనా స్పందించి సాయుధ దళాల నియామకాల్లో పాతపద్ధతినే కొనసాగించాలని నారాయణ హితవు పలికారు.

మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపైనా నారాయణ స్పందించారు. ట్రిపుల్ ఐటీకి రెండేళ్లుగా వీసీ లేకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వానికి వీసీని నియమించే శక్తి కూడా లేదా? అని నారాయణ నిలదీశారు.

Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపథ్ విధానం తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ, పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

కాగా, అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది. ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా, అగ్నిపథ్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ, యువతకు ఇది సువర్ణావకాశం అని అన్నారు. త్వరలోనే ప్రారంభమయ్యే అగ్నిపథ్ నియామక ప్రక్రియలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం అగ్నిపథ్ కు మద్దతు పలికారు. దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ప్రయోజనకరం అని అభిప్రాయపడ్డారు.