CPM-Adani: అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసింది: సీపీఎం ఆరోపణలు

అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. అది మాములు విషయం అని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఆరోపణలు అన్నీ విదేశీ కుట్ర అని ఆర్ఎస్ఎస్ చెబుతోందని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

CPM-Adani: అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసింది: సీపీఎం ఆరోపణలు

CPI-CPM

CPM-Adani: అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. అది మాములు విషయం అని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఆరోపణలు అన్నీ విదేశీ కుట్ర అని ఆర్ఎస్ఎస్ చెబుతోందని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

అదానీ గ్రూప్ పై కుట్ర జరిగితే విచారణ జరిపించాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కుట్ర నిజమే అయితే అందరం కలిసి కొట్లాడదామని అన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. చర్చకు, చర్యలకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. కులవ్యవస్థకి మూలం పండిట్లే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని చెప్పారు.

మరో సందర్భంలో పండిట్లు కాదు.. మేధావులే కారణమని అంటారని అన్నారు. కొందరు వ్యక్తుల మీద తప్పులను నెట్టేసి.. కుల వ్యవస్థను కాపాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మానుకోవాలని అన్నారు. త్రిపురలో బీజేపీ హింసను పెంచేసిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర పడుతుంటే దాడులు విస్తృతం చేసిందని ఆరోపించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తాం: తమ్మినేని
తెలంగాణ బడ్జెట్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. తెలంగాణ బడ్జెట్ సంఖ్య భారీగా ఉందని, అంతే భారీగా కేటాయింపులు చేసి, ఖర్చు పెట్టాలని చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తామని చెప్పారు. ఎన్నికల పొత్తుపై చర్చ జరుగుతోందని అన్నారు. సీపీఎం, సీపీఐకి సీట్లు ఇవ్వబోమని మంత్రులు అంటున్నారని చెప్పారు. పొత్తులూ ఉండవని కొందరు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఇది సరికాదని, తాము త్వరలోనే సీపీఐతో చర్చ లు జరుపుతామని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఇప్పటికే కొంత విచారణ జరిగిందని చెప్పారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. వలసలు.. ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని చెప్పారు. పార్టీ మారాలని అనుకుంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. ఫిరాయింపుల కోసం బీజేపీ ఓ నాయకుడికి బాధ్యతలు ఇవ్వడం జుగుప్సాకరమని విమర్శించారు. బీజేపికి వ్యతిరేకంగా వచ్చే నెల కార్యాచరణ ఉంటుందని అన్నారు.

INDIANS AT DUBAI : భారతీయులు దుబాయ్‌లో ఇళ్లు ఎందుకు కొంటున్నారు? వ్యాపారవేత్తల చూపంతా యూఏఈపై ఉండటానికి కారణాలేంటీ?