Telangana Police : వాహనదారులకు వార్నింగ్.. రెండోసారి దొరికితే క్రిమినల్ కేసు, బండి సీజ్

విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టారు. తెలంగాణలోనూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ ను స్ట్రిక్ట్ గా పోలీసులు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి అకారణంగా వచ్చిన వారి తాట తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.

Telangana Police : వాహనదారులకు వార్నింగ్.. రెండోసారి దొరికితే క్రిమినల్ కేసు, బండి సీజ్

Telangana Police

Telangana Police : విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టారు. తెలంగాణలోనూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ ను స్ట్రిక్ట్ గా పోలీసులు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి అకారణంగా వచ్చిన వారి తాట తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.

అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తే ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి పట్టుబడితే మీ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేసేస్తారు. అంతేకాదు.. క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ హెచ్చరించారు. హయత్‌నగర్‌, ఉప్పల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్బీనగర్‌, మీర్‌పేట, మందమల్లమ్మ ప్రాంతాల్లో శుక్రవారం(మే 14,2021) సీపీ పర్యటించారు. ఏసీపీ పురుషోత్తంరెడ్డితో కలిసి వాహనదారులను తనిఖీ చేశారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై రెండు రోజుల్లో 2,400 కేసులు నమోదు చేయగా.. ఇందులో 700 చలాన్లను రాత్రి సమయాల్లో విధించినవన్నారు. ఇలా.. రెండోసారి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వస్తే వారి వాహనాలను సీజ్‌ చేసి.. క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉల్లంఘనలపై ప్రతి ఎంట్రీ డాటాబేస్‌లో ఉంటుందని అన్నారు. దీంతో ఎవరైనా రెండోసారి రోడ్డు మీదకు వస్తే.. పోలీసు ట్యాబ్‌లో ఒక్క క్లిక్‌తో సమాచారం తెలిసిపోతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి రాకుండా కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.