Fake certificate : ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ కేసులు

టీఎస్‌పీఎస్సీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నకిలీ సర్టిఫికెట్లతో మోసాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. తప్పుడు పత్రాలతో ఉద్యోగం ...

Fake certificate : ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ కేసులు

Fake Cartificet

Fake certificate : టీఎస్‌పీఎస్సీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నకిలీ సర్టిఫికెట్లతో మోసాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాలని చూస్తే అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో నోటిఫికేన్లు విడుదల చేయనుంది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ మరో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇతర ఉద్యోగాలకు కూడా విడతల వారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌-పేరా 9 (ఏ) రూల్‌ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్‌ చేయడమే కాకుండా క్రిమినల్‌ కేసులు పెడతామని అధికారులు పేర్కొంటున్నారు.

Fake Vehicle Sticker : నగరంలో పోలీసుల తనిఖీలు.. దొంగ స్టిక్కర్స్ వాహనాలపై నిఘా

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఇప్పటికే గ్రూప్-1 కు సంబంధించి నోటిపికేషన్ విడుదలకు సిద్ధమవ్వగా, త్వరలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనుంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించారు. గతంలో ఫేక్‌ సర్టిఫికెట్లతో బురిడీ కొట్టించబోయి నలుగురు అభ్యర్థులు డిబార్‌ అయ్యారు. టీఆర్టీ హిందీ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించి, మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించగా అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యర్థులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు తేలడంతో నోటీసులు జారీ చేసి, డిబార్‌ చేశారు.

Fake Bus Pass: నకిలీ బస్ పాసులు సృష్టించి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ప్రస్తుతం కొందరు అభ్యర్థులు విద్యార్హతలు, స్థానికతకు సంబంధించిన ఫేక్‌ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశమున్నట్టు టీఎస్‌పీఎస్సీ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫేక్‌ సర్టిఫికెట్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మూతబడ్డ స్కూళ్లు, కొన్ని ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. స్థానికేతరులు ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రమాదం ఉన్నదని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫేక్‌ సర్టిఫికెట్ల ఘటనలు గతంలో చోటుచేసుకోవటంతో కమిషన్‌ సభ్యులు అప్రమత్తమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను టీఎస్‌పీఎస్సీయే చేపట్టినా, అనుమానాలున్న సర్టిఫికెట్ల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో త్వరలో జరగబోయే ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా టీఎస్‌పీఎస్సీ అధికారులు దృష్టికేంద్రీకరించారు.