మరో 7రోజుల్లో…. దేశంలో 1లక్షకు చేరుకోనున్న కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 09:30 AM IST
మరో 7రోజుల్లో…. దేశంలో 1లక్షకు చేరుకోనున్న కరోనా కేసులు

లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో ఒక్కరోజులోనే అత్యధిక కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 4,213కరోనా కేసులు నమోదయ్యాయని,మొత్తంగా ఇప్పటివరకు 67,152కేసులు నమోదైనట్లు ఇవాళ(మే-11,2020)ఉదయం కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ఆదివారం ఒక్కరోజే 97మంది చనిపోయారని,మొత్తంగా 2,206కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. గడిచిన 48గంటల్లో కరోనా కేసుల సంఖ్య 13శాతం పెరిగినట్లు తెలిపింది. గడిచిన రెండు రోజుల్లో ముంబై,అహ్మదాబాద్,చెన్నై,థానే,ఇండోర్ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు తెలిపింది. గడిచిన 48గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 39శాతం ఈ ఐదు జిల్లాల్లోనే నమోదైనట్లు తెలిపింది.

రికవరీ రేటు మెరుగుపడుతుందని,కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపింది.కోలుకుంటువారి శాతం 31.4శాతంగా ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. 17వేలకు పైగా కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా,5వేలకు పైగా కేసులతో దేశంలో తమిళనాడు రెండవస్థానంలో నిలిచింది.  

17వేలకు పైగా కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా,5వేలకు పైగా కేసులతో దేశంలో తమిళనాడు రెండవస్థానంలో నిలిచింది. అయితే,ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే..మరో 7రోజుల్లో దేశంలో కేసుల సంఖ్య 100,000కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసుల పెరుగుదల భారతదేశపు ఒత్తిడితో కూడిన మెడికల్ కెపాసిటీ మరియు అధిక భారం కలిగిన ఆరోగ్య వ్యవస్థకు తీవ్రమైన సవాలుగా ఉండనుంది.

Read More:

* కరోనా నివారణకు ఆయుర్వేదిక్ మెడిసిన్

జూన్-జులై నెలల్లో కరోనా కేసులు తగ్గిపోవచ్చు!!