Hyderabad : రూ. 3 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్లను కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్లు గుర్తించారు.

Hyderabad : రూ. 3 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Hyderabad (3)

Hyderabad : హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. పెళ్లి పేరుతో కొందరిని మోసం చేస్తే, లాటరీ పేరుతో ఇంకొందరిని అడ్డంగా ముంచేశారు. తాజాగా మరో భారీ సైబర్ మోసం జరిగింది. ఆర్బీఎల్ బ్యాంకు అధికారులమంటూ పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్లను కాజేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

చదవండి : Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తుందని గుర్తించి.. ఓ పోలీస్ బృందాన్ని అక్కడికి పంపారు. లొకేషన్ కనుగొని దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడి సమయంలో ఏడుగురు పారిపోయారు. ఢిల్లీ, ఉజ్జ‌యినిలో ఆఫీసులు ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చదవండి : Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్‌ నేరాలు : బిపిన్ రావత్‌