Cyber Attack On Midhani : మిధానిపై సైబర్ అటాక్.. రూ.40లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు.

Cyber Attack On Midhani : మిధానిపై సైబర్ అటాక్.. రూ.40లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

Cyber Attack On Midhani : సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి డబ్బు కాజేస్తున్నారు. రెప్పపాటులో ఏమార్చి లక్షలు, కోట్లు నొక్కేస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీపై సైబర్ అటాక్ జరిగింది.

Mahesh Bank Case : మహేష్ బ్యాంక్ కేసులో ట్విస్ట్.. బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు జైలుశిక్ష

హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు. కెనడా నేషనల్ ఆల్ కంపెనీ నుంచి మిధాని సంస్థ.. అల్యూమినియం కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. అమెరికా అకౌంట్ నెంబర్ ను ఈ-మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపారు.

Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్‌లైన్ నెంబర్..

సైబర్ చీటర్స్ పంపిన అమెరికా అకౌంట్ కు మిగతా డబ్బును మిధాని సంస్థ పంపింది. అయితే, తమ మిగతా డబ్బు చెల్లించాలని కెనడా నేషనల్ ఆల్ కంపెనీ మిధాని సంస్థను అడిగింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మిధాని సంస్థ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.