Cyber Crime: వెయ్యి కడితే పది వేలు, లక్ష కడితే ఐదు లక్షలు.. ఊరు ఊరునే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.

Cyber Crime: వెయ్యి కడితే పది వేలు, లక్ష కడితే ఐదు లక్షలు.. ఊరు ఊరునే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime

Cyber Crime: సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా వికారాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం జరిగింది. జిల్లాలోని పూడూర్ మండలం కడుమూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు లైమ్ కంపెనీ పేరుతో ఓ లింక్ పంపారు సైబర్ నేరగాళ్లు.

చదవండి : Cyberabad Police : డిసెంబర్ 31..క్యాబ్ డ్రైవర్లు రైడ్‌‌కు నిరాకరించారా..ఫిర్యాదు చేయొచ్చు..వాట్సాప్ నెంబర్ ఇదే

ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకొని వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే పదివేలు ఇస్తామని, లక్ష కడితే ఐదు లక్షలు ఇస్తామని నమ్మబలికారు. ఇంతలోనే ఓ కిలాడీ లేడి ఫోన్‌ కాల్‌లోకి ఇద్దరు యువకులకు మాయమాటలు చెప్పింది. కట్టిన డబ్బుకు పదింతలు ఇస్తామని తెలిపింది. దీంతో ఇద్దరు యువకులు పెట్టుబడిపెట్టి.. స్నేహితులకు, చుట్టాలకు, చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు.

చదవండి : Cyberabad Traffic : మద్యం మత్తులో ఉంటే..వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్‌‌లు, బార్లదే

దీంతో గ్రామానికి చెందిన 200 మంది ఆ యాప్ లో డబ్బు కట్టారు. కొందరు వెయ్యితో సరిపెట్టుకుంటే, మరికొందరు అత్యాశకు పోయి లక్షల్లో పెట్టుబడి పెట్టారు. అయితే కొద్దీ సేపటి తర్వాత యాప్ సేవలు నిలిచిపోయాయి. అప్పటికే గ్రామస్తులంతా కోటి రూపాయలవరకు పెట్టుబడి పెట్టారు. యాప్ ఓపెన్ కాకపోవడంతో తమకు కాల్ చేసిన లేడికి సంప్రదించే ప్రయత్నం చేశారు యువకులు.. అయితే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

చదవండి : AP Cyber Crime : లవ్ లైఫ్..ప్రేమే జీవితమంటూ..కోట్ల రూపాయల మోసం