Cyber Cheat : కరోనా పేరుతో ఘరానా మోసం, లక్షలు దోచేసిన సైబర్ క్రిమినల్స్

కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

Cyber Cheat : కరోనా పేరుతో ఘరానా మోసం, లక్షలు దోచేసిన సైబర్ క్రిమినల్స్

Cyber Cheat

Cyber Cheat : కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మోసం చేయడానికున్న ప్రతి మార్గాన్ని వెతుకుతున్నారు సైబర్ నేరగాళ్లు. కేటుగాళ్ల ఉచ్చులో పడి డబ్బు పొగొట్టుకుని అమాయకులు లబోదిబోమంటున్నారు. ఓ వ్యక్తి ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుని పోలీసులు ఆశ్రయించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

కోవిడ్ ఎమర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా మోసానికి తెరతీశారు. మెయిల్ హ్యాక్ చేసి నకిలీ ఈమెయిల్ ద్వారా 23లక్షలు కాజేశారు. హైదరాబాద్ కి చెందిన వీరేంద్ర బండారీ అనే వ్యాపారి పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేశారు. తాను కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు 23.60లక్షలు ఆన్ లైన్ లో పంపాలని మెయిల్ చేశారు. వ్యాపారి ప్రమేయం లేకుండానే నకిలీ లెటర్ ప్యాడ్ పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి బేగంపేట్ యాక్సిస్ బ్యాంకుకి మెయిల్ చేశారు. సంతకం సరిపోవడంతో సైబర్ నేరగాళ్లు చెప్పిన మూడు బ్యాంకు ఖాతాలకు అధికారులు 23.60లక్షలు నగదుని బదిలీ చేశారు. నిన్న సాయంత్రం వీరేంద్ర బ్యాంకు ఖాతా చెక్ చేయగా, డబ్బులు తక్కువగా ఉన్నాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదే తరహాలో హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాను ఆసుపత్రిలో ఉన్నానని, తన అకౌంట్ నుంచి అర్జంట్ గా 5లక్షలు బదిలీ చేయాలని, నకిలీ లెటర్ పై సంతకం చేసి బ్యాంకుకి పంపారు సైబర్ చీటర్స్. దీంతో నిజమే అనుకుని వారు చెప్పిన బ్యాంకు అకౌంట్ కి 5లక్షలు ట్రాన్సఫర్ చేశారు కొటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు. అయితే తనకు తెలియకుండానే సంతకాన్ని ఫోర్జరీ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపైనా పోలీసులు విచారణ చేపట్టారు.