Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం

సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో, స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో ఈజీగా మోసం చేస్తున్నారు. రెప్పపాటులో బాధితుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు..

Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం

Cyber Crime

Cyber Crime : సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో, స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో ఈజీగా మోసం చేస్తున్నారు. రెప్పపాటులో బాధితుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు కొల్లగడుతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, మేసేజ్ లు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. మోసపోవద్దని.. బ్యాంకు అధికారులు, సైబర్ నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నా ఇంకా కొందరు అడ్డంగా మోసపోతూనే ఉన్నారు. కేటుగాళ్ల వలకు చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

తాజాగా హైదరాబాద్ లో కేవైసీ అప్ డేట్ పేరుతో ఘరానా మోసం జరిగింది. ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.15 లక్షలు దోచేశారు. బాధితురాలికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తనను బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఎస్‌బీఐ అకౌంట్‌కు చెందిన కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఆమెతో చెప్పాడు. వెంటనే కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే మీ అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుందని ఆమెని భయపెట్టాడు. అతడి మాటలు గుడ్డిగా నమ్మిన ఆమె.. అతడు అడిగిన అన్ని బ్యాంకు వివరాలు ఇచ్చేసింది.

అంతేకాదు.. ఆ తర్వాత ఆమె మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని కూడా ఆ వ్యక్తికి చెప్పేసింది. అంతే.. క్షణాల వ్యవధిలోనే ఆమె అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.15లక్షలు కాజేశారు కేటుగాళ్లు. అకౌంట్ నుంచి రూ.15లక్షలు మాయం కావడంతో బాధితురాలు కంగుతింది. తాను మోసపోయానని తెలిసి లబోదిబోమంది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

ఇదే తరహాలో మరో ఘరానా మోసం కూడా చోటు చేసుకుంది. స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాలంటూ రూ.7లక్షలు కాజేశారు కేటుగాళ్లు. ఓ మహిళకు ఆన్‌లైన్‌ లో పరిచయమైన వ్యక్తి.. స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. అతడు చెప్పినట్టు రూ.7లక్షలు పెట్టుబడిగా పెట్టింది. కట్ చేస్తే.. ఆ మొత్తాన్ని అతడు కాజేశాడు. లాభాలు చూసుకునేందుకు ప్రయత్నించగా.. అప్పుడామెకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. తాను మోసపోయానని తెలుసుకుంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.