Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.

Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Criminal

Cyber criminals : అమాయకులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. వేలు మొదలుకొని లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి కొంతమంది సర్వం కోల్పోతున్నారు. కామారెడ్డి జిల్లాలో లోన్ పేరుతో భారీగా డబ్బులు దోచుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ముదం గల్లీకి చెందిన రాజేశ్వరికి లోన్ ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.40,000 టోకరా వేశారు.

ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.

Cyber Crime: వెయ్యి కడితే పది వేలు, లక్ష కడితే ఐదు లక్షలు.. ఊరు ఊరునే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

లోన్ వస్తుందనే ఆశతో రాజేశ్వరి ఫోన్ పే ద్వారా 40,000 చెల్లించారు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజేశ్వరి.. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.