Cyclone Asani: అసనికి తోడుగా బంగాళఖాతంలో ద్రోణి: తెలంగాణకు వర్ష సూచన

అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

Cyclone Asani: అసనికి తోడుగా బంగాళఖాతంలో ద్రోణి: తెలంగాణకు వర్ష సూచన

Asani

Cyclone Asani: బంగాళఖాతంలో అసని తుఫాను ప్రభావం కొనసాగుతుంది. సోమవారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన “అసని” తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్ర-ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అసని తుఫాను తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్నం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. అసని తుఫాను ప్రభావం తెలంగాణపై పాక్షికంగానే ఉన్నట్లు ఆమె వివరించారు.

Also read:Taneti Vanitha : అసాని తుఫాన్ తో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి తానేటి వనిత

ఏ.పికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అసని తుఫాన్ ప్రభావం తెలంగాణపై పెద్దగా లేకపోయినా..ఈదురుగాలుల తీవ్ర ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ సంచాలకులు నాగరత్నం వివరించారు. అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు.

Also read:Asani Cyclone : తీవ్ర తుఫానుగా అసాని.. తీర ప్రాంత ప్రజలకు అలర్ట్

ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళఖాతంలోని తీవ్ర తుఫాను ప్రదేశం నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతుంది. దీనిప్రభావంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు గురువారం తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అయితే ద్రోణి ప్రభావం, తుఫాను ప్రభావం సమాంతరంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి మరియు మంచిర్యాల జిల్లాలలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Also read:Rains In Telangana : రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు