Cyclone Tauktae : హైదరాబాద్ లో వర్షం..తౌక్తా ప్రభావం ?

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు.

Cyclone Tauktae : హైదరాబాద్ లో వర్షం..తౌక్తా ప్రభావం ?

Hyd

Hyderabad : హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు. చల్లటి వాతావరణం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీగా గాలులు వీచాయి. అనంతరం..భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిన జనాలు..చల్లటి వాతావరణానికి ఊపిరిపీల్చుకున్నారు. అయితే..బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని అనుకున్నా..కరోనా క్రమంలో విధించిన లాక్ డౌన్ వారికి అడ్డుకట్ట వేసింది. ఇంట్లోనే ఉంటూ..చల్లటి గాలిని..వాన తుంపరలను చూస్తూ ఎంజాయ్ చేశారు.

అరేబియా సముద్రంలో
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం వాయుగుండంగా మారిపోయంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్ కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, మరింత బలపడి ఈనెల 16న తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఒకవేళ తుపాన్ గా మారితే..దీన్ని ‘తౌక్తా’ అని పిలువనున్నారు. తౌక్తా తుఫాను తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మే 16 వరకు శక్తివంతంగా ఉంటుంది అని, వాయువ్య దిశగా కదులుతుందని చెబుతున్నారు. ఈ తుఫాన్‌కు మాయన్మార్ తౌక్తా అనే పేరు పెట్టింది. తౌక్తా అంటే పెద్ద శబ్దం చేసే బల్లి. లక్షద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లు వెల్లడించింది. తౌకతీ ప్రభావంతో కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.

Read More :  Chiranjeevi : వైర‌స్ కంటే భ‌యమే ముందుగా చంపేస్తోంది.. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. అందరూ జాగ్ర‌త్త‌గా ఉండండి – చిరంజీవి