Dalit Bandhu : ప్రభుత్వ ఉద్యోగికి కూడా రూ.10లక్షలు, తిరిగి చెల్లించాల్సిన పని లేదు

అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ

Dalit Bandhu : ప్రభుత్వ ఉద్యోగికి కూడా రూ.10లక్షలు, తిరిగి చెల్లించాల్సిన పని లేదు

Dalit Bandhu

Dalit Bandhu : అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందన్నారు. దళితుల అభ్యున్నతి లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.

CM KCR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చామన్న కేసీఆర్.. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తామని చెప్పారు. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చని, దళితబంధుతో ముడిపెట్టమని తేల్చి చెప్పారు.

పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు ఎంపిక ఉంటుందని, ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని కేసీఆర్ చెప్పారు. ”హైదరాబాద్‌ మినహా ప్రతి జిల్లాలో దాదాపు 20 శాతం ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు” అని కేసీఆర్ మండిపడ్డారు.

Ticket Prices : వైజాగ్ టు హైదరాబాద్ రూ.3వేలు.. టికెట్ల ధరలు భారీగా పెంపు

రూ.10లక్షలు మళ్లీ చెల్లించాల్సిన పని లేదు..
”వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే బడ్జెట్‌ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. దళితుల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.4వేల కోట్లతో రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా జరిగి కుటుంబం నష్టపోతే రక్షణనిధితో ఆదుకుంటాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? సందేహం లేదు.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. దళిత బంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన పనిలేదు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80 లక్షల కోట్లు అవసరం అవుతుంది” అని కేసీఆర్ అన్నారు.